న్యూఢిల్లీ: 79వ జాతీయ స్క్వాష్ ఛాంపియన్లుగా అనహత్, వెలవాన్ నిలిచారు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను 15ఏళ్ల అనహత్, పురుషుల సింగిల్స్ టైటిల్‌ను వెలవాన్ చేజిక్కించుకున్నారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో తమిళనాడుకు చెందిన వెలవాన్ సెంథిల్‌కుమార్ సహచర ఆటగాడు అభరు సింగ్‌నొ 12ా10, 11ా3, 12ా10(3ా0)తో ఓడించాడు. ఇక మహిళల సింగిల్స్‌లో అనహత్ సింగ్(ఢిల్లీ)బీళి 9ా11, 11ా4 ఆధిక్యతలో ఉండగా ఢిల్లీకే చెందిన తన్వి ఖన్నా గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగింది. దీంతో 15ఏళ్ల అన్నహత్ విజేతగా నిలిచింది. దీంతో అతి పిన్న వయసులో జాతీయ స్క్వాష్ ఛాంపియన్‌గా నిలిచి రెండో ప్లేయర్‌గా అన్నహత్ రికార్డుపుటల్లోకెక్కింది. అంతకుముందు జ్యోష్న చిన్నప్ప 2000లో 14ఏళ్లకే జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. మొత్తమ్మీద జోష్న చిన్న 19సార్లు ఛాంపియన్ టైటిల్‌ను చేజిక్కించుకుంది.