సైబెట్(ఢాకా): న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలిటెస్ట్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు గెలుపు చేరువైంది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ జట్టు 338పరుగులు చేయడంతో న్యూజిలాండ్ ముందు 332పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ జట్టు నాల్గోరోజు ఆట ముగిసే సమయానికి 7వికెట్ల నష్టానికి 113పరుగులు చేసింది. డెవాన్ కాన్వే(22), తొలి ఇన్నింగ్స్ సెంచరీ బాదిన కేన్ విలియమ్సన్(11), టామ్ బండిల్(6)లను పేసర్ తైజుల్ ఇస్లాం ఔట్ చేశాడు. శుక్రవారం ఆట నిలిచే సమయానికి డారిల్ మిచెల్(44), ఇష్ సోథీ(7) క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ బంగ్లాదేశ్ 310 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ జట్టు 317పరుగులు చేసిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను శాంటో(105) సెంచరీకి తోడు ముష్ఫికర్ రహీమ్(67), హసన్ మిరాజ్(50) అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. న్యూజిలాండ్ బౌలర్లు అాజ్ పటేల్‌కు నాలుగు, ఇష్ సోథీకి రెండు వికెట్లు దక్కాయి. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను కట్టడి చేయడంలో బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లామ్(4/40) సఫలమయ్యాడు. దీంతో ఆ జట్టు శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌లో 113పరుగులకే 7వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.