మంజు

Nov 13,2023 18:34 #Sneha, #Stories
tea

అనగఅనగా ఒక ఊరిలో మంజు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి తెలివితేటలు తక్కువ. అందరూ ‘మొద్దు..మొద్దు’ అని పిలిచేవారు. అతను ఒక చిన్న టీ కొట్టులో పని చేస్తూ జీవనం సాగిస్తాడు. మంజు పొద్దునే లేచి ఎవరు రాక ముందే టీ కొట్టు దగ్గరకు వచ్చేస్తాడు. సామాన్లు అన్ని శుభ్రం చేసుకుని, మంచి టీ పెడతాడు. రైల్వే స్టేషన్‌ నుండి వచ్చి, పోయే వాళ్లంతా టీ తాగుతూ ఉంటారు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. వ్యాపారం బాగా నడుస్తుంది. ఒక రోజు మంజు టీ అమ్ముతూ ఉండగా తన యజమాని అక్కడికి వస్తాడు. ‘మంజు! వెంకటేష్‌ వచ్చాడా?’ అని అడుగుతాడు.
‘రాలేదు అయ్యా!’ అని సమాధానం ఇస్తాడు.
‘ఇంకా రాలేదా! ఈ పాటికే వచ్చేయాలే.. సరే వస్తే..నన్ను పిలువు సరేనా’ అని మంజుతో చెప్పి యజమాని అక్కడి నుండి వెళ్లిపోతాడు. కొంతసేపు తరువాత వెంకటేష్‌ అక్కడికి వస్తాడు. అప్పుడు మంజు పరుగున వెళ్లి తన యజమానిని పిలుచుకుని వస్తాడు.
యజమాని వెంకటేష్‌తో ‘ఎలా ఉన్నావ్‌ బాబు? నువ్వు ఇచ్చిన ఆకులతో టీ పెడుతున్నా.ీ వ్యాపారం చాలా బాగా సాగుతుంది. అందరూ నా కొట్టుకే వస్తున్నారు. అంతా నీ వల్లే. ఆ ఆకులు అయిపోయాయి. త్వరగా వెళ్లి ఆ ఆకులు తీసుకుని రా’ అని అంటాడు. అందుకు వెంకటేష్‌ ఐదు వేలు అడుగుతాడు. దానికి ఆ యజమాని ‘ఐదువేలా? అంత డబ్బా! నా కొట్టు అమ్మినా రావు అయ్యా. అంత డబ్బు ఇవ్వలేను అని చెప్తాడు. ఐతే నేను కూడా ఆ ఆకులను తెచ్చి మీకు ఇవ్వలేను అని చెప్పి వెంకటేష్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మంజు పక్కనే ఉండి ఇదంతా వింటాడు. అప్పడతను యజమాని బాధ చూడలేక… ‘అయ్యా ఆ ఆకులు అతనే ఎందుకు తేవాలి?’ అని అడుగుతాడు. యజమాని అది ఒక అడవి. ఆ అడవిలోనే ఆ ఆకులు దొరుకుతాయి. ఆ అడవికి వెళ్లడానికి మూడు దారులే ఉంటాయి. ఒక దారిలో నీరు, రెండో దారిలో మంటలు, మూడో దారిలో నిప్పులుంటాయి అని చెప్తాడు. ‘అల ఐతే వెంకటేష్‌ ఆ అగ్ని మంటల్లో ఎలా వెళ్లగలడు అని అడుగుతాడు. ‘ఓరేరు మొద్దు..! నీరు ఉన్న దారిలో ఈదుకుంటూ వెళతాడు’ అని చెప్పి బాధపడుతూ కూర్చుంటాడు. అప్పుడు మంజు నేను వెళ్లి తెస్తానయ్య అంటాడు. అందుకు యజమాని కోపంతో నీ పని టీ అమ్మడం. నీ పని నీవ్వు చెరు! అని చెప్పి వెళ్లిపోతాడు.
మంజు ఎలాగైనా ఆ ఆకులు తీసుకురావాలనుకుంటాడు. చాలా దూరం వెళ్లగా నీరు కనిపిస్తుంది. కష్టపడి ఈదుకుంటూ ఒడ్డుకు వెళతాడు. అక్కడ అంతా చెట్లు ఉంటాయి. ఆ అడవిలో ఉన్న చెట్ల ఆకులను కోసి తీసుకెళతాడు. అవి చూసి యజమాని సంతోషిస్తాడు. మంజు సహసాన్ని మెచ్చుకుంటారు. అప్పటి నుంచి ‘మొద్దు’ అని పిలవడం మానేస్తారు.

రొంగలి భువన,
9వ తరగతి, అనకాపల్లి జిల్లా, అచ్చుతాపురం.
విశాఖ జిల్లా.

➡️