పిల్లలకి ఇష్టమైన పండగ సంక్రాంతి
కొత్త బట్టలతో కళకళలాడుతుంది సంక్రాంతి.
పిండి వంటలతో ఘుమఘుమలాడుతుంది సంక్రాంతి
గంగిరెద్దుల ఆటలతో ఆనందాన్ని ఇస్తుంది సంక్రాంతి
అందరినీ ఒక చోటచేర్చేది సంక్రాంతి
మనలో ఉదయించే క్రాంతి సంక్రాంతి
అందరూ చేసుకోండి ఆనందంగా సంక్రాంతి
నామాల.గ్రీష్మ
7వ తరగతి,
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల,
రఘుమండ,
విజయనగరం.