నాన్నా, మరలా వస్తావా…!!

Nov 26,2023 09:39 #Sneha
child poetry on father

అప్పుడప్పుడు
ఆకాశాన్ని వంచి
తెచ్చి ఇచ్చేస్తానంటాను !
ఎంత మోసపోతుందో అమ్మ !
‘ఆమె’ కైతే
ఎన్ని కోటలు దాటించేసానో !
సంసార నౌక సాగాలిగా..!
కాలం పొడుగునా ఎన్ని..
నా వాగ్దానాలు..
అక్క కష్టాల కడలిలో..
కలిసిపోయాయో !
చూడు ఎంత నమ్మకమో
కళ్ళు ఆర్పకుండా..
ఇంకా నా వేపే చూస్తోంది
పిచ్చి తల్లి ! నా చిట్టి చెల్లి !
నాన్నా.. !నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా
నిన్ను మరిపించాలనిపిస్తుంది !
బాధ్యతలు నెరవేర్చాలనిపిస్తుంది!
మరలా వస్తావా..!
కొన్నాళ్ళు నన్ను.. మళ్ళీ నడిపిస్తావా !!

– తిప్పాన హరిరెడ్డి, 9493832412

➡️