అనగనగా రామాపురంలో ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. తమకు ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి రాజు అనే కొడుకు ఉన్నాడు. అతను పట్టణంలో ఉద్యోగం చేస్తూ, తల్లిదండ్రులకు ప్రతినెలా కొంత డబ్బు పంపించేవారు.రాజును ఊరికి రమ్మని తల్లిదండ్రులు పిలిచినా, ఇప్పుడు కుదరదు అని చెప్పేవాడు. రాజుకి పల్లెటూరు అంటే చిరాకు. అక్కడ ఉండే ప్రజల పద్ధతులు, మాట తీరు నచ్చేది కాదు. అందుకే తల్లిదండ్రులు ఎంతగా బతిమిలాడినా వచ్చేవాడు కాదు. కొన్ని ఏళ్ల తర్వాత రాజు తండ్రి చనిపోయాడు. అప్పుడు రాజు ఊరికి రాక తప్పలేదు. తల్లిని ఒంటరిగా వదిలి వెళ్లలేక కొన్ని రోజులు ఊరిలోనే ఉన్నాడు. దాంతో అతని ఉద్యోగం పోయింది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ పట్టణం వచ్చాడు. రోజులు గడుస్తున్నా ఉద్యోగం దొరకలేదు. దాంతో అతని దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చు అయింది. తిరిగి ఊరికి వచ్చాడు. రాజు ముఖంలోని విచారం చూసి తల్లి బాధపడింది. పనిలో పడితే బాధలు మరిచిపోతాడని ఆలోచించి, పొలం తీసుకెళ్లింది. దారిలో అందరూ రాజుని తన కుటుంబసభ్యుడిలా ప్రేమగా పలకరించారు. రోడ్లు వెంట పచ్చని చెట్లు, పక్షులు, చెరువులో బాతులు, కొంగలు ఈత కొడుతూ కనిపించాయి. పిల్లలు చెరువు గట్టున చేరి ఆడుకుంటున్నారు. పొలంలో కష్టాన్ని మరిచిపోయేందుకు మహిళలంతా పాటలు పాడుతున్నారు. ఈ దృశ్యాలన్నీ చూసి రాజు మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చాయి. భవిష్యత్తులో వ్యాపారం చేసుకుంటూ, ఏ కలుషితం లేని పల్లెటూరులో నిర్ణయించుకుంటాడు.
– డాప్ప భవాని, 10వ తరగతి, జి.సిగడాం,
ఎ.పి. మోడల్ స్కూలు.
శ్రీకాకుళం జిల్లా.