ఇంటర్నెట్‌డెస్క్ : చలికాలంలో చర్మం పగులుతుంది. పొడిబారుతుంది. ఈ కాలంలో చర్మం సున్నితత్వం కోల్పోయి చాలా రఫ్‌గా మారుతుంది. అందుకే శీతాకాలంలో చర్మ సంరక్షణపై తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఈ కాలంలో చిన్న చిన్న చిట్కాలతో చర్మం పొడిబారకుండా చూసుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..!
– కొబ్బరినూనె చర్మానికి రాసుకుంటే పొడిబారకుండా ఉంటుంది.
– ఈకాలంలో చర్మానికి రాసే క్రీములకు బదులుగా.. పాల మీగడ, వెన్న చర్మానికి రాసుకుంటే.. పొడిబారడం తగ్గుతుంది. మృదువుగా మారుతుంది.
– వాతావరణం చల్లగా ఉండడం వల్ల నీటిని తక్కువగా తీసుకుంటాం. దీంతో శరీరం డీహైడ్రేడ్ అయి చర్మం పొడిబారటానికి కారణమవుతుంది. అందుకే చలికాలంలో నీటిని తాగడంపైనా శ్రద్ధపెట్టాలని వైద్యులు చెబుతున్నారు.