ఆకుల్లోనూ పోషకాలు ఈ సీజన్లో లభించే ఫలాల్లో సీతాఫలం అత్యంత మధురమైనది. ఫలమే కాదు; ఆకుల్లోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సీతాఫలం ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఆకులను శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడపోసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. సీతాఫలం ఆకుల కషాయాన్ని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైరస్, బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి.. సీతాఫలం ఆకుల కషాయం మధుమేహులకు వరంగా చెప్పొచ్చు. పరగడుపున ఈ ఆకుల కషాయాన్ని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకుల కషాయాన్ని తాగితే వృద్ధాప్య ఛాయలను తొలగించి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. గుండె పోటు రాకుండా చేస్తుంది. పుండ్లు, గాయాలు ఉన్నచోట ఈ ఆకులను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని వాటిపై ఉంచాలి. ఇలా చేస్తూ ఉంటే త్వరగా మానిపోతాయి. గజ్జి, తామర, దురద ఉన్నచోట కూడా ఈ ఆకుల మిశ్రమాన్ని రాస్తే చర్మ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. ఈ ఆకుల పొడిని కలిపి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.