ఇంటర్నెట్‌డెస్క్ : తమిళంలో బిగ్బాగ్ – 7 షో కంటెస్టెంట్ నటి విచిత్ర చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లో విచిత్ర తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి నోరు విప్పారు. 90ల్లో తాను నటించే సినిమాలో.. ఆ సినిమా సెట్లో ఆ మూవీ హీరో తనను లైంగింకంగా వేధించడంతో తాను సినిమాలకు దూరమైనట్లు విచిత్ర తెలిపింది. ఈ షోకి హోస్ట్‌గా విశ్వనటుడు కమల్‌హాసన్ వ్యవహరిస్తున్నారు. విచిత్ర తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి షోలో ఆమె చెప్పే సమయంలో కమల్ ఎవరా హీరో అని ప్రశ్నించారు. అయితే విచిత్ర తనను వేధించిన హీరో పేరు బయటకు చెప్పకుండా మౌనం వహించారు. విచిత్ర అలా మౌనం వహించినందుకు.. ‘ఆమె ప్రవర్తన పరిపక్వతతో ఉందని వ్యాఖ్యానించారు. అయితే కమల్ హాసన్ వ్యాఖ్యలపై ప్రముఖ సింగర్ చిన్మయి విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. వేదింపులకు గురిచేసిన అతని పేరును విచిత్ర బయటకు చెప్పకపోవడంతో.. ‘తమ కోపాన్ని కూడా అనుమతించని మహిళలకు నిజ జీవితంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.’ అని రాసుకొచ్చారు. ఇక కమల్ వ్యాఖ్యల్ని కూడా చిన్మయి తప్పుపట్టారు. ‘పరిపక్వ ప్రవర్తన’ అని చెబుతూ ప్రేక్షకుల్ని చప్పట్లు కొట్టమని కమల్‌హాసన్ ప్రేక్షకులను ప్రోత్సహించారు. ఎలాగైనా ప్రాణాలతో బయటపడినవారు లైంగిక వేధింపుల గురించి సామాజికంగా రుచికరమైన, ఆమోదయోగ్యమైన రీతిలో మాట్లాడాలి! అని చిన్మయి తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా చిన్మయి సినీ పరిశ్రమలో పోస్కో యూనిట్‌ను ఏర్పాటు చేయాలని తాను గత ఐదున్నరేళ్లుగా అడుగుతున్నాని గుర్తు చేశారు.