తమిళ నటుడు సూర్య ‘కంగువా’ సినిమా షూటింగ్లో ఒక బరువైన కెమెరా సూర్య భుజంపై పడగా గాయమైంది. ఈ సినిమా ఒక్క తమిళంలోనే కాకుండా మిగతా అన్ని భాషల్లోని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి దర్శకుడు శివ, నిర్మాతలు జ్ఞానవేల్ రాజా, ప్రమోద్, వంశీ కృష్ణ. ఒక పోరాట సన్నివేశం చిత్రీకరిస్తుండగా, ఒక కెమెరా మీద పడడంతో సూర్య భుజానికి గాయం అయిందని తెలిసింది. వెంటనే సూర్యని దగ్గరలో వున్నా ఆసుపత్రికి వెళ్లి, చికిత్స తీసుకున్నారు.