ప్రజాశక్తి – ఆచంట
కరుగోరుమిల్లి గ్రామంలో శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించునున్న రామాలయానికి ఎంఎల్ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు గురువారం శంకుస్థాపన చేశారు. పనులు త్వరితగతిన పూర్తిచేయాలని సంఘం పెద్దలను కోరారు. ఈ కార్యక్రమంలో ముందుగా టిడిపి నాయకులు, ఎంపిపి దిగమర్తి సూర్యకుమారి, జెడ్పిటిసి ఉప్పలపాటి సురేష్‌బాబు, సర్పంచి అల్లం పద్మావతి, పితాని వెంకట్, ఎఎంసి ఛైర్మన్ చిల్లే లావణ్య, సర్పంచులు సుంకర సీతారాం, బోడపాటి బుల్లియ్య పాల్గొన్నారు.