ప్రజాశక్తి – పోడూరు
నేటి లేగ దూడలే రేపటి పాడి పశువులనే నినాదంతో పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన గుమ్మలూరులో సర్పంచి సోనియా రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 35 లేగ దూడలను రైతులు ప్రదర్శనకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఇఒ జి.ఏసు రత్నం మాట్లాడుతూ లేగ దూడలను శాస్త్రీయ పద్ధతిలో పెంచినట్లయితే వాటిని మంచి పాడి పశువులుగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న దూడలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు మిగిలిన వాటికి ప్రోత్సాహక బహుమతులను నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి గుంటూరి పెద్దిరాజు, ఎంపిపి సబ్బితి సుమంగళి, ఎడి జాయకర్ జాన్సన్, డాక్టర్ మాధురి పాల్గొన్నారు.