స్థానిక సమస్యల పరిష్కారానికి చొరవ

పార్కును పరిశీలిస్తున్న డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగర ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ స్థానిక సమస్యలు పరిష్కారానికి చొరవ చూపుతున్నామని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఆదివారం నగరంలోని 43వ డివిజన్‌ పరిధిలో ఉడాకాలనీ ఫేజ్‌-2లో నిరుపయోగంగా ఉన్న పార్కు ప్రాంతాన్ని పరిశీలించారు. పార్కు నిరుపయోగంగా ఉండడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. పార్కు పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పర్యవేక్షణ బాధ్యత స్థానికులే తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమన్నారు. ఇప్పటికే నగరాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి చూపించామన్నారు. ప్రజలు మరోసారి అవకాశమిస్తే మిగిలిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ దాసరి సత్యవతి, వైసిపి డివిజన్‌ అధ్యక్షులు వంతరం సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️