ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని 30వ డివిజన్ ధర్మపురి ప్రాంతంలో సిసి రహదారి పనులకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి బుధవారం శంకుస్థాపన చేశారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీధిదీపాలు ఏర్పాటుకు తక్షణం చొరవ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ధర్మపురిలో రూ.6 లక్షలతో సిసి రోడ్డు ఏర్పాటుకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. నగరంలోని 38వ డివిజన్ గోకపేటలో రౌండ్ టేబుల్ ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన పాఠశాల భవన నిర్మాణానికి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రౌండ్ టేబుల్ చైర్మన్ దినేష్, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్ కౌశిక్, జోనల్ ఇన్ఛార్జి డాక్టర్ విఎస్ ప్రసాద్, ఎంఇఒ రాజు, కార్పొరేటర్లు పతివాడ గణపతిరావు, సంధ్యారాణి, జోనల్ ఇన్ఛార్జి మారం బాలబ్రహ్మారెడ్డి, వైసిపి నాయకులు నారాయణప్పడు, తదితరులు పాల్గొన్నారు.