వేపాడ : వైసిపి నాలుగున్నరేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ అన్నారు. శుక్రవారం మండలంలోని సింగరాయి గ్రామంలో టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు ఆధ్వర్యాన బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గొంప కృష్ణ ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి వివరించారు. వైసిపి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ తిరోగమనంలో పయనించిందన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం ద్వారా యువత, మహిళలు, రైతులతోపాటు బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించవచ్చన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షులు గుమ్మడి భారతి, నాయకులు జనపరెడ్డి ఈశ్వరరావు, గొర్లి నాగరాజు, సిరికి రమణ, సర్పంచ్ సేనాపతి లీలా అప్పారావు, మంచిన అప్పలసూరి, పల్లి ధనుంజయ, కె. పి. నాయుడు తదితరులు పాల్గొన్నారు.బొండపల్లి : మండలంలోని ఒంపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ ఇల్లాపు కృష్ణ ఆధ్వర్యంలో బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ పాల్గొని, కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు.