ప్రజాశక్తి-బొబ్బిలి : విద్యారంగ పరిరక్షణే లక్ష్యంగా యుటిఎఫ్ పోరాటాలు సాగిస్తోందని ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయగౌరి తెలిపారు. బుధవారం యుటిఎఫ్ బొబ్బిలి మండలం నూతన కౌన్సిల్ సమావేశంలో విజయగౌరి మాట్లాడారు. నూతన విద్యావిధానం అమలుతో ఇప్పటికే రాష్ట్ర విద్యారంగం అతలాకుతలం అయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో జిపిఎస్ రద్దు చేస్తామని ఎవరు ప్రకటిస్తారో వారికి ఉపాధ్యాయ, ఉద్యోగుల మద్దతు ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఉపాధ్యాయులపై అధికారుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల బోధనకు ఆటంకంగా ఉండే చర్యలను జిల్లా సహాధ్యక్షులు ప్రసన్నకుమార్ తప్పుబట్టారు. అనంతరం నూతన కౌన్సిల్ ఎన్నికలను జిల్లా కార్యదర్శి కేశవరావు నిర్వహించారు. మండల నూతన అధ్యక్షులుగా మహేష్, ప్రధాన కార్యదర్శిగా బత్తుల శ్రీనివాసరావు, సహాధ్యక్షులుగా అప్పలనాయుడు, కస్తూరి , కోశాధికారిగా అనంతరావు, సిపిఎస్ కన్వీనర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముందుగా ఉపాధ్యాయ ఉద్యమ నేత కామ్రేడ్ శేషగిరికి ఘనంగా నివాళులర్పించారు.