ప్రజాశక్తి-విజయనగరం టౌన్
స్థానిక లీ ప్యారడైజ్‌లో ఆదివారం క్రెడారు ఆధ్వర్యంలో ప్రాపర్టీ ఎక్స్‌పోను డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మాణ రంగంలో కృషి, ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రాపర్టీ షో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇందులో మూడు జిల్లాల నుంచి అనేక నిర్మాణ సంస్థలు ప్రదర్శనలు ఏర్పాటు చేశాయి. ప్రాపర్టీ షోలో క్రైడారు ప్రతినిధులు చంద్రబోస్, రాజ్ కుమార్, సభ్యులు, అనేక సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు.