పర్యవేక్షణ పేరుతో ఉపాధ్యాయులను వేధించడం తగదు

Nov 26,2023 13:12 #Vizianagaram
utf oppose pressure on teachers

ఓపిఎస్ ను అమలు చేయాలి
యుటిఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పర్యవేక్షణ పేరుతో రాష్ట్రంలో, జిల్లా వ్యాప్తంగా వేదింపులకు గురి చేయడం సరికాదని, ప్రతి చిన్న దానికి బాద్యుల ను చేయడం సరికాదని యు టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు అన్నారు. ఆదివారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా యు టి ఎఫ్.49 వ కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పిల్లలు ఒకే సామర్ధ్యాలతో ఉండరు,బాగా చదివిన వారు ఉంటారు,స్లో లేర్నార్స్ కూడా ఉంటారు. 20 నుంచి 25 శాతం స్లో లేర్ణర్స్ ఉంటారు, అవి పట్టించుకోకుండా ఉపాధ్యాయుల ను బాధ్యులను చేయడం సరికాదన్నారు. సిపిఎస్, జిపిఎస్ కాకుండా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఓపిఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేసే జీఓ 117ను రద్దు చేయాలని సమావేశం ద్వారా డిమాండ్ చేశారు. దేశంలో సిలబస్ లో చరిత్ర పాఠాలను, గుజరాత్ అల్లర్లను, గాంధీజీ హత్య, డార్విన్ జీవపరిణామ సిద్దాంతం, ఆవర్తన పట్టిక, పోరాటాలు వంటి వాటిని తొలగించడం అంటే ఇప్పుడున్న విద్యార్దులకు చరిత్ర గురించి అవగాహన లేకుండా చేయడమేనని అన్నారు. శాస్త్రీయ దృక్పథంలో ఆలోచన లేకుండా చేయడం వంటివి మన దేశాన్ని తిరోగమన పద్దతిలో వెళ్ళడానికి దారితీస్తుంది ఇది చాలా ప్రమాదమన్నారు. ప్రభుత్వ విద్యా రంగ అభివృద్ధిలో సామాజిక బాధ్యత కలిగిన యుటిఎఫ్ సంఘంగా ఉపాద్యాయులు కృషి చేయాలని కోరారు. ఉపాద్యాయులు ఎవ్వరూ పర్యవేక్షణ కు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఉపాద్యాయులు వెంట యుటిఎఫ్ ఉంటుందన్నారు.అనంతరం జిల్లా అధ్యక్షులు రమేష్ చంద్ర పట్నాయక్ అధ్యక్షత జరిగిన 49 వ జిల్లా యు టి ఎఫ్ కౌన్సిల్ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జే ఏ వి అర్ కె ఈశ్వరరావు కార్యదర్శి నివేదికను ప్రవేశ పెట్టారు.కౌన్సిల్ సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి గా యు టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రవీంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే విజయగౌరీ, రాష్ట్ర నాయకులు డి.రాము,కే.శ్రీనివాసరావు, జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ.సత్య శ్రీనివాస్ రావు, సహద్యక్షులు వి.ప్రసన్నకుమార్,జి.పార్వతి ,కోశాధికారి సి హెచ్ బాస్కరరావు, రాష్ట్ర కౌన్సిలర్ల ఎం.అప్పలనాయుడు,జి.పద్మావతి, కె.అప్పారావు,జిల్లా కార్యదర్శులు కె.ప్రసాదరావు, తిరుపతినాయుడు, పి.త్రినాథ్,వి.వాసు కేశవ ,రాధభవాని, శ్రీదేవి ,జి వి రమణ,రాజారావు,ఎన్.సత్యన్నారాయణ,.ఆడిట్ కమిటీ కన్వీనర్ ఏ.శంకరరావు,.సి పి ఎస్ కమిటీ కన్వీనర్ పి.రామ్ ప్రసాద్ మండల నాయకులు,మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️