గూడూరు (కర్నూలు) : యుటిఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం గూడూరు మండల కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో యుటిఎఫ్ మండల అధ్యక్షుడుగా కాంతారావుని, ప్రధాన కార్యదర్శిగా షబిరహ్మద్ ని, అధ్యక్షుడుగా వామనమూర్తిని, సహాధ్యక్షులుగా ఆడాం షఫీ అల్లాని, ట్రెజరర్ గా శ్రీనివాసులు, మిగతా సంఘ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాజ్, జిల్లా సహాధ్యక్షులు రవికుమార్, రాష్ట్ర సహాధ్యక్షులు కె.సురేష్ కుమార్ హాజరయ్యారు. అంతేకాకుండా సమావేశంలో సురేష్ మాట్లాడుతూ … ఉద్యోగులకు సంబంధించిన సిపిఎస్ రద్దు అనే అంశము జిపిఎస్ గా మార్చడం ఏమాత్రం ఉద్యోగులకు కరెక్ట్ కాదు అన్నారు. ఈ గ్యారెంటీ పెన్షన్స్ వలన అనేక ఇబ్బందులు ఉన్నాయని కాబట్టి కాంట్రిబ్యూషన్ లేని పెన్షన్ ఉద్యోగులు కోరుకుంటున్నారని తెలిపారు. ఒపిఎస్‌ను అమలుపరచాలని యుటిఎఫ్ గా డిమాండ్ చేశారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న రావలసిన అనేక ఆర్థిక బకాయిలు పిఎఫ్, ఎపిజిఎల్‌ఐసి, ఈఎల్‌ఎస్ మొదలగునవి వెంటనే చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారిగా ఎస్‌ఎం జయరాజు, పరిశీలకులుగా జిల్లా అధ్యక్షులు ఎస్.మారెప్ప హాజరయ్యారు.