హైకోర్టు జడ్జిల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ జి.రామకష్ణప్రసాద్‌లు శనివారం జిల్లాలో పర్యటించారు. ముందుగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆయాన్ని

సన్మానిస్తున్న బార్‌ కౌన్సిల్‌ సభ్యులు, న్యాయవాదులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ జి.రామకష్ణప్రసాద్‌లు శనివారం జిల్లాలో పర్యటించారు. ముందుగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆయాన్ని దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, అర్చకులు స్వాగతించారు. ఆలయంలో స్వామివారి సేవల్లో పాల్గొన్న అనంతరం అనివేటి మండపంలో వారికి ఆలయ ఇఒ వి.హరి సూర్యప్రకాష్‌ స్వామివారి శేష వస్త్రాలను కప్పి చిత్రపటాలను అందజేశారు. వారి వెంట జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా పాల్గొన్నారు. అనంతరం సన్‌రైజ్‌ హోటల్‌కు చేరుకున్నారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ మర్యాద పూర్వకంగా కలుకుని పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. అలాగే బార్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ ఎన్ని సూర్యారావు, మూడో అదనపు జిల్లా జడ్జి పి.భాస్కరరావు, ప్రోటోకాల్‌ జడ్జి కందికట్ల రాణి, బార్‌ కౌన్సిల్‌ రాష్ట్ర మెంబర్‌ గేదెల వాసుదేవరావు, సీనియర్‌ న్యాయవాదులు తర్లాడ రాధాకృష్ణ, కె.అఫీసునాయుడు, కూన అన్నంనాయుడు, పి.వి.రమణ దయాల్‌, మామిడి క్రాంతి, జిల్లా బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి పొన్నాడ రాములు కలిసి వారికి దుశ్శాలువ కప్పి సన్మానించారు.

 

➡️