ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్‌పి రాధిక
- ఎస్‌పి జి.ఆర్ రాధిక
ప్రజాశక్తి- శ్రీకాకుళం
స్పందన ఫిర్యాదులపై తక్షణ చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు ఎస్‌పి జి.ఆర్ రాధిక ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో 37 మంది ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. కుటుంబ తగాదాలు 3, పౌర సంబంధమైనవి 8, ఆస్తి తగాదాలకు సంబంధించినవి 5, పాతవి 7, ఇతరత్రా పలు అంశాలపై 14 అందిన్నాయి. అనంతరం ఫిర్యాదులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని సానుకూలంగా స్పందించారు. అనంతరం పోలీస్ స్టేషన్ల పరిధిలోని అధికారులకు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందజేశారు. ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ చేపట్టి నిర్ధేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించాలన్నారు. పై ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను వెంటనే ఎస్‌పి కార్యాలయానికి నివేదించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్‌పిలు టి.పి.విఠలేశ్వర్, జె.తిప్పేస్వామి పాల్గొన్నారు.