సమస్యలు పరిష్కారమయ్యేనా?

జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో అన్ని రకాల పంటలు కలిపి 4,37,165 ఎకరాల సాగు లక్ష్యంగా నిర్ధేశించుకోగా 3,81,833 ఎకరాల్లో (87 శాతం) పంటలు వేశారు. వరి పంటను 3,98,750 ఎకరాల్లో వేస్తారని అంచనా వేయగా 3,39,588 ఎకరాల్లో (85 శాతం) సాగైంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో, వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. వ్యవసాయశాఖ అధికారుల లెక్కల ప్రకారం 15 మండలాల పరిధిలో 20,812 ఎకరాల్లో వరి ఎండిపోయింది. ఖరీఫ్‌లో 253 ఎకరాల్లో పెసలు వేయాలని
  • జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు
  • రబీలోనూ వెంటాడుతున్న సాగునీటి సమస్యొ
  • సమస్యలు పరిష్కారమయ్యేనా?ఇళ్ల బిల్లులు అందక లబ్ధిదారుల అవస్థలు

నేడు జెడ్‌పి సర్వసభ్య సమావేశంజిల్లాలో అనేక సమస్యలు పేరుకుపోయాయి. ప్రధానంగా ఖరీఫ్‌లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా వేలాది ఎకరాల్లో రైతులు పంటలు వేయలేకపోయారు. వంశధార ఆయుకట్టులోని శివారు భూములకు సాగునీరందక పంటలు ఎండిపోయాయి. వంశధార కాలువల్లో గుర్రపుడెక్క, పూడిక తొలగించలేదు. షట్టర్ల అవినీతిపై సిఐడి కేసుతో కొత్తవి అమర్చకపోవడంతో పాడైన వాటితోనే నెట్టుకొస్తున్నారు. 2014-19 మధ్య కాలంలో నిర్మించిన ఇళ్లకు బిల్లులు రాక వేలాది మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు విద్యుత్‌, ఆర్‌ అండ్‌ బి రోడ్లు తదితర సమస్యలూ ఉన్నాయి. శనివారం నిర్వహించే జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో వీటిపై సభ్యులు చర్చించి ఏం పరిష్కారం చూపుతారో అని ఎదురుచూస్తున్నారు.

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో అన్ని రకాల పంటలు కలిపి 4,37,165 ఎకరాల సాగు లక్ష్యంగా నిర్ధేశించుకోగా 3,81,833 ఎకరాల్లో (87 శాతం) పంటలు వేశారు. వరి పంటను 3,98,750 ఎకరాల్లో వేస్తారని అంచనా వేయగా 3,39,588 ఎకరాల్లో (85 శాతం) సాగైంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో, వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. వ్యవసాయశాఖ అధికారుల లెక్కల ప్రకారం 15 మండలాల పరిధిలో 20,812 ఎకరాల్లో వరి ఎండిపోయింది. ఖరీఫ్‌లో 253 ఎకరాల్లో పెసలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించగా 20 ఎకరాల్లో వేశారు. రాగులు 145 ఎకరాల్లో రైతులు వేస్తారని అంచనా వేయగా 20 ఎకరాల్లో వేశారు. గోగు పంటను ఈ సంవత్సరం 258 ఎకరాల్లో వేయాలని లక్ష్యంగా తీసుకోగా 48 ఎకరాల్లో వేశారు. నువ్వు పంటను 98 ఎకరాల్లో వేస్తారని అంచనా వేయగా ఒక ఎకరాలోనూ వేయలేదు.రబీలోనూ వెంటాడుతున్న సాగునీటి సమస్యలుమునుపెన్నడూ లేని విధంగా వంశధార, నాగావళి నదుల్లో నీటి ప్రవాహం జీరో లెవల్స్‌కు పడిపోయాయి. ఒడిశాల్లోనూ వర్షాల్లేకపోవడంతో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా నవంబరులో వంశధారలో నాలుగు వేల క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో ఉంటుంది. ప్రస్తుతం 500 క్యూసెక్కులకు మించి నీటి ప్రవాహం రావడం లేదు. నాగావళిలో ఈ సీజన్‌లో మూడు వేల క్యూసెక్కుల నీరు ప్రవహించేది. ప్రస్తుతం నీటి ప్రవాహం జీరోకి పడిపోయింది. ఖరీఫ్‌ చివరిలో పంటలు ఎండిపోతుండడంతో తోటపల్లి, మడ్డువలస నుంచి నీటిని విడిచిపెట్టి పంటలను కాపాడారు. గొట్టాబ్యారేజీ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 0.66 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 0.47 టిఎంసిలకు పడిపోయింది. మడ్డువలస రిజర్వాయర్‌ సామర్థ్యం 3.37 టిఎంసిలు కాగా, 1.05 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రబీలో ఆరుతడి పంటలకూ నీరు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు.ఇళ్ల నిర్మాణ బిల్లులు రాక ఇబ్బందులుజిల్లాలో 2014 నుంచి 2018 వరకు నిర్మించిన ఎన్‌టిఆర్‌ గృహాలకు ఇప్పటికీ ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదు. ఇళ్ల కేటాయింపులు, నిర్మాణాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలతో ప్రభుత్వం వాటికి డబ్బులు ఆపేసింది. ఇళ్లను పరిశీలించి డబ్బులు చెల్లిస్తామని చెప్పినా, ఇప్పటివరకు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేయలేదు. జిల్లాలో సుమారు 19 వేల ఇళ్లకు సుమారు రూ.285 కోట్ల వరకు చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బుల కోసం లబ్ధిదారులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.ధాన్యం కొనుగోలే అసలు సమస్యఖరీఫ్‌ సీజన్‌లో 3,51,843 ఎకరాల్లో వరి వేశారు. ఈ ఏడాది 8.17 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అందులో 7,87,447 మెట్రిక్‌ టన్నులు మార్కెట్‌లోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం 5.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. ధాన్యం కొనుగోలులో గతేడాది రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. మిల్లర్లు ఇచ్చిన బ్యాంకు గ్యారంటీ విలువ పూర్తవడంతో దూర ప్రాంతాల్లోని మిల్లులకు కేటాయించారు. ఒక మండలానికి చెందిన రైతులకు 40, 50 కిలోమీటర్ల దూరంలో వేరే మండలంలో ఉన్న మిల్లులకు కేటాయించారు. దీంతో రైతులు తీవ్ర వ్యయ ప్రయాసలకు లోనయ్యారు. ధాన్యం నాణ్యంగా లేవంటూ పలుచోట్ల ఆర్‌బికె సిబ్బంది తిరస్కరించారు. దీన్నే అవకాశంగా తీసుకున్న మిల్లర్లు వాటిని మిల్లర్లు తక్కువ ధరకే కొనుగోలు చేయడంతో 80 కేజీల బస్తాకు అదనంగా నాలుగైదు కేజీలు ఎక్కువ తీసుకున్న పరిస్థితులను రైతులు చవిచూశారు.

➡️