ప్రజాశక్తి – శ్రీకాకుళం
పారాలీగల్ వాలంటీర్లు వ్యవస్థలపై నమ్మకం కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయం న్యాయ సేవా సదన్‌లో బుధవారం పారాలీగల్ వాలంటీర్ల రెండో రోజు శిక్షణా కార్యక్రమంలో మాట్లాడారు. వ్యవస్థలపై నమ్మకం ఉన్నప్పుడే ప్రజలకు భరోసా కల్పించగలరని చెప్పారు. వ్యవస్థ అభ్యున్నతికి పాటుపడేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. రిసోర్స్‌పర్సన్ న్యాయవాది అన్నెపు సత్యనారాయణ కమ్యూనికేషన్ స్కిల్స్, మెట్ట సత్యనారాయణ ఫ్యామిలీ చట్టం, పి.వి.ఎస్ సీతారామయ్య ఆస్తి హక్కు, అన్నెపు భువనేశ్వరరావు క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్‌జడ్జి ఆర్.సన్యాసినాయుడు, శ్రీకాకుళంలోని ఇతర కోర్టులు, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, నరసన్నపేట, కోటబొమ్మాళి, పాలకొండ, పలాస, పాతపట్నం, రాజాం, సోంపేట, టెక్కలి, కొత్తూరు, పొందూరు కోర్టుల నుంచి వర్చువల్‌గా పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.మాట్లాడుతున్న జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా