మాట్లాడుతున్న గుప్త
- ఆదిత్య కళాశాల సిఇఒ గుప్త
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
ప్రతి విద్యార్థికీ చదవుకునే దశ ఎంతో కీలకమని, ఈ సమయాన్ని వృథా చేసుకోకుండా సత్ప్రవర్తన కలిగి ఉండడంతో పాటు నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలు చేరుకోగలరని ఆదిత్య డిగ్రీ అండ్ పిజి కళాశాల సిఇఒ ఎంఎస్‌ఎస్ గుప్త అభిప్రాపడ్డారు. కళాశాల ప్రిన్సిపాల్ తూలుగు విజయకుమార్ నాయుడు అధ్యక్షత 23వ వార్షికోత్సవం నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదిత్య డిగ్రీ, పిజి కళాశాల ఆవిర్భవించిన తర్వాత ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దామని అన్నారు. క్యాంపస్ ఇంటర్వూల ద్వారా ఎంతో మంది మంచి ఉద్యోగాలు సాధించారని అన్నారు. క్రమశిక్షణతో చదవుకుంటే మంచి భవిష్యత్ సాధ్యమవుతుందన్నారు. నాణ్యమైన విద్య నందించడంతో పాటు కళాశాలలో నైపుణ్యాన్ని అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో యాజమాన్య సభ్యులు మాడుగుల మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ డి.శైలజ, అధ్యాపక సిబ్బంది నరేష్ రమేష్, నిరంజన్, మీనాక్షి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు జ్ఞాపికలను బహూకరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.