రాష్ట్రానికి మోడీ ద్రోహం

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలను అమలు చేస్తామని తొమ్మిదేళ్ల కిందట తిరుపతిలో వాగ్ధానం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని వామపక్షాల నాయకులు విమర్శించారు. మాట తప్పిన మోడీ రాష్ట్ర ప్రజలకు

నిరసన తెలుపుతున్న వామపక్షాల నాయకులు

  • ఎన్నికల హామీలు విస్మరణ

* ప్రత్యేక హోదా ప్రకటించాలి

* వామపక్ష నాయకుల డిమాండ్‌

  • ప్రధాని పర్యటనపై నిరసన

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలను అమలు చేస్తామని తొమ్మిదేళ్ల కిందట తిరుపతిలో వాగ్ధానం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని వామపక్షాల నాయకులు విమర్శించారు. మాట తప్పిన మోడీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తిరుపతికి మోడీ రాకను వ్యతిరేకిస్తూ నగరంలోని అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద వామపక్షాలు ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2014 ఏప్రిల్‌ 30న రాష్ట్ర విభజన తర్వాత తిరుపతి, నెల్లూరు సభల్లో ఇచ్చిన హామీలను మోడీ విస్మరించారన్నారు. తిరుమలకు వస్తున్న మోడీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తిరుపతిలో ప్రధానిని విభజన హామీలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిలదీయాలన్నారు. రాష్ట్రాన్ని అదానీకి కట్టబెట్టే ప్రయత్నంమోడీ, జగన్‌ కలిసి రాష్ట్రాన్ని అదానీకి కట్టబెట్టే ప్రయ్నతం చేస్తున్నారని విమర్శించారు. విద్యుత్‌ స్మార్ట్‌మీటర్లు, సోలార్‌ ఒప్పందం ఇందులో భాగమేనని చెప్పారు. గ్రీన్‌ఎనర్జీలో 58 శాతం అదానీ చేతిలో ఉందని, విద్యుత్‌పై ఆయనకు గుత్తాధిపత్యం కల్పిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అదానీ దోపిడీని పురంధేశ్వరి ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మోడీ ఆదేశాల మేరకే జగన్‌ విద్యుత్‌ ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. సోలార్‌ విద్యుత్‌ యూనిట్‌ రూ.2.71 ఒప్పందం చేసుకుంటున్నారని, దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఒప్పందం ఉందా అని ప్రశ్నించారు. గతంలో రూ.2.48 తీసుకుంటేనే విచారణ చేయాలని కోరిన జగన్‌, ఇప్పుడు ఎందుకు ఇంత పెద్దఎత్తున ఒప్పందం చేసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రతి రెండేళ్లకోసారి సోలార్‌ ఉత్పత్తి ఖర్చు తగ్గుతున్నా, 25 ఏళ్లకు ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. సోలార్‌ విద్యుత్‌ యూనిట్‌ 46 పైసలకు వస్తుందని, ప్యానల్స్‌ ధరలు కూడా తగ్గిపోతున్నాయని చెప్పారు. ఇప్పటికే రూ.2,600 కోట్లు అదానీకి దోచిపెట్టి వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారని విమర్శించారు. స్మార్ట్‌మీటర్లపై విచారణ చేయాలిస్మార్ట్‌మీటర్లు కూడా అదానీ కోసం పెడుతున్నారని తెలిపారు. ఒక్కో మీటరు (గృహావసర) రూ.14 వేల నుంచి రూ.17 వేలకు, వ్యవసాయ మీటరును రూ.37 వేలకు కొంటున్నారని, దేశంలో ఎక్కడా ఇంత ధర లేదని చెప్పారు. గృహావసర మీటరు రూ.3,500, దాని నిర్వహణకు మరో రూ.3500 అవుతోందని, అయినా రూ.14 వేలకు కొంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో గృహావసర ఒక్కో కనెక్షన్‌పై రూ.10 వేలు భారం వేస్తున్నారని, వ్యవసాయ కనెక్షన్‌కు రూ.20 వేలు అదనంగా వసూలు చేస్తున్నారని అంటే రూ.20 వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని తెలిపారు. వినియోగించిన విద్యుత్‌ కంటే అదనపు విద్యుత్‌కు బిల్లులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో మోడీ, జగన్‌ ఆడుతున్న నాటకాన్ని బయటపెట్టాలన్నారు. స్మార్ట్‌మీటర్ల వ్యవహారంపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.పవన్‌ను జన సైనికులు ప్రశ్నించాలిమోడీని మూడోసారి ప్రధానిని చేయాలంటున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, ఎందుకు చేయాలో చెప్పాలన్నారు. హోదా పాచిపోయిన లడ్డు అన్న పవన్‌, ఇప్పుడు వాటిని తీసుకొచ్చి వెంకన్న కాళ్ల దగ్గర పెట్టి క్షమాపణ కోరాలన్నారు. ప్రశ్నించడానికి పుట్టామని చెప్పిన పవన్‌, మోడీని ప్రశ్నిస్తారా, లేదో ప్రజలకు చెప్పాలన్నారు. జనసేనను ఆర్‌ఎస్‌ఎస్‌లో విలీనం చేసేలా ఉన్నారని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు పవన్‌ వంతపాడడంపై జన సైనికులు వపన్‌ను ప్రశ్నించాలని కోరారు.పెద్దల కోసమే అసైన్డ్‌ చట్ట సవరణరాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల అసైన్డ్‌ ల్యాండ్‌ పేదల చేతుల్లో నుంచి సంపన్నుల చేతుల్లోకి మారుతోందని, అసలు లబ్ధిదారులకే భూములు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. పేదల భూములను పెద్దలకు అప్పగించేందుకు అసైన్డ్‌ చట్టాన్ని సవరించారని, ఇది పేదలను మోసం చేసేందుకు ఆడుతున్న నాటకమన్నారు. ఆక్రమణలో ఉన్న భూములను బేషరతుగా వాస్తవ హక్కుదారులు, వారి వారసులకు తిరిగి ఇవ్వాలని కోరారు. ఈ మోసంపై టిడిపి, జనసేన పార్టీలు స్పందించడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సిపిఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి.ప్రకాష్‌, వామపక్షాల నాయకులు కె.మోహనరావు, జి.సింహాచలం, కె.నాగమణి, పి.తేజేశ్వరరావు, కె.అప్పారావు, ఎన్‌.వి రమణ, ఎ.మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

➡️