రాజ్యాంగ పీఠిక స్ఫూర్తి

భారత రాజ్యాంగ పీఠికను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా అన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం న్యాయాధికారులు, న్యాయశాఖ

రాజ్యాంగ పీఠికను చదివిస్తున్న జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

  • జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

ప్రజాశక్తి – శ్రీకాకుళం

భారత రాజ్యాంగ పీఠికను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా అన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులతో రాజ్యాంగ పీఠికను చదివించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలపై సరైన అవగాహన పెంచుకొని నిబద్ధత కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి శ్రీదేవి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు, మెజిస్ట్రేట్‌లు కందికట్ల రాణిశ్రీ, భరణి పెద్దసంఖ్యలో న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.పారాలీగల్‌ వాలంటీర్లకు ఐడి కార్డులుజిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలోని న్యాయ సేవా సదన్‌లో సోమవారం నిర్వహించిన ఐదో రోజు శిక్షణా కార్యక్రమంలో పారాలీగల్‌ వాలంటీర్లకు జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా ఐడి కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారాలీగల్‌ వాలంటీర్లు ఐడి కార్డులను దుర్వినియోగం చేయరాదన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకుని ఉచితంగా న్యాయ సేవలు అందించడానికి మాత్రమే వీటిని ఉపయోగించాలని సూచించారు.

 

➡️