మా సమస్యలు పట్టించుకోరా..?

గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదని, తాగడానికి కలుషిత నీరు తప్ప మంచినీరు లేదని, కాలువల్లేక మురుగునీరు రోడ్డుపైనే ఉండడంతో వ్యాధుల బారిన పడుతున్నామని బూర్జ మండలంలోని అయ్యవారిపేట గ్రామస్తులు శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలతో సహవాసం చేస్తున్నా పట్టించుకోరా అని గ్రామంలో శుక్రవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం

బూర్జ : అయ్యవారిపేటలో గోతులు దాటుతున్న స్పీకర్‌ సీతారాం

స్పీకర్‌ను నిలదీసిన అయ్యవారిపేట గ్రామస్తులు

ప్రజాశక్తి – బూర్జ, పొందూరు

గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదని, తాగడానికి కలుషిత నీరు తప్ప మంచినీరు లేదని, కాలువల్లేక మురుగునీరు రోడ్డుపైనే ఉండడంతో వ్యాధుల బారిన పడుతున్నామని బూర్జ మండలంలోని అయ్యవారిపేట గ్రామస్తులు శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలతో సహవాసం చేస్తున్నా పట్టించుకోరా అని గ్రామంలో శుక్రవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్‌ను నిలదీశారు. సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వర్షాధార భూములే ఆధారం కావడంతో చెక్‌డ్యామ్‌ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన స్పీకర్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి బి.రామారావు, ఎంపిపి ప్రతినిధి కె.నాగేశ్వరరావు, టిడ్కో డైరెక్టర్‌ కె.గోవిందరావు, వైస్‌ ఎంపిపిలు బి.సూర్యారావు, కె.కృష్ణం నాయుడు తదితరులు పాల్గొన్నారు.మౌలిక సదుపాయాల కల్పనతో విద్యా ప్రమాణాల పెంపుప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. పొందూరు మండలం తాడివలస జెడ్‌పి ఉన్నత పాఠశాలలో రూ.43 లక్షల ఆర్‌ఎంఎస్‌ఎ నిధులతో నిర్మించిన నూతన తరగతి భవనాలను శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఎపిసి ఆర్‌.జయప్రకాష్‌, ఎంపిపి కిల్లి ఉషారాణి, ఎంఇఒలు రామరాజు, రాజారావు, వైసిపి మండల అధ్యక్షులు పి.రమేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️