- బటన్ నొక్కి 15 రోజులు
- చాలామందికి ఖాతాల్లో జమ కాని నగదు
- రైతుభరోసా కోసం ఎదురుచూపులు
- సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు
బటన్ నొక్కి 15 రోజులు గడిచినా చాలామంది రైతులకు నేటికీ రైతుభరోసా డబ్బులు జమ కాలేదు. రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడతల వారీగా డబ్బులు చెల్లిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఏడాదికి రూ.ఆరు వేల సాయాన్ని మూడు విడతలుగా అందిస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500ను మూడు విడతలుగా అందిస్తోంది. రెండో విడత కింద ఇవ్వాల్సిన సొమ్ముల్లో కేంద్ర ప్రభుత్వం ఈనెల 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 7వ తేదీన రైతుల ఖాతాల్లో డబ్బులు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించినా, ఇప్పటివరకు ఖాతాల్లో జమ కాలేదు. పంట కోతలకు డబ్బులు కావాల్సి ఉండడంతో, డబ్బుల కోసం
ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి, కవిటి
జిల్లావ్యాప్తంగా సుమారు 3,21,854 మంది రైతులకు రూ.132.41 కోట్లను రైతు భరోసా కింద జమ చేయాల్సి ఉంది. రైతు భరోసా వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ఉండడంతో ఎంతమందికి వచ్చింది, ఎవరికి రాలేదనే సమాచారం అధికారులకూ తెలియడం లేదు. గ్రామాల్లో మాత్రం అత్యధిక మంది రైతులు తమకు పిఎం కిసాన్ డబ్బులు వచ్చాయని, రైతు భరోసా సొమ్ములు రాలేదంటూ చెప్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిధులు విడుదల చేసిన వెంటనే నాలుగైదు రోజుల్లోనే 70, 80 శాతం రైతుల ఖాతాలకు నగదు జమయ్యేది. ఈసారి పది రోజులు గడిచినా ఇప్పటికీ రైతు భరోసా జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సచివాలయాల చుట్టూ తిరుగుతూ రైతు భరోసా ఎప్పుడు వస్తుందని, అసలు తమకు వస్తుందా? లేదా? అని సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.రైతు భరోసా సొమ్ములంటూ ప్రచారంరాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద అందిస్తున్న రూ.7,500లో మొదటి విడతగా ఖరీఫ్ ఖర్చుల కోసం రూ.5,500 అందిస్తోంది. పంట కోతలు, రబీ అవసరాల కోసం అక్టోబరులో రూ.రెండు వేలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఈ డబ్బులే రైతుల ఖాతాల్లో జమ కాలేదు. ఇదే సమయంలో పిఎం కిసాన్ డబ్బులు పడుతుండడంతో అవే రైతు భరోసా డబ్బులు అంటూ గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు, సిబ్బంది ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి రైతుల సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు వస్తున్నా వారికి అవగాహన లేకపోవడంతో, నిజమే కాబోలు అంటూ నమ్ముతున్న పరిస్థితి నెలకొంది.డబ్బులు జమ అవుతున్నాయిరైతు భరోసా డబ్బులు 90 శాతం మందికి జమయ్యాయి. బ్యాంకు అకౌంట్, ఆధార్ లింక్ వంటి సమస్యల వల్ల కొందరికి డబ్బులు రాలేదని తెలుస్తోంది. వీటిపై రైతుల నుంచి అర్జీలు వస్తున్నాయి. వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటాం- కె.శ్రీధర్, సంయుక్త సంచాలకులు, వ్యవసాయశాఖవరి కోతలకు డబ్బుల్లేవుఖరీఫ్‌లో ఈసారి వర్షాల్లేక ఇంజిన్లు, ఇతర ఖర్చుల కోసం అదనంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది. పిఎం కిసాన్ డబ్బులతో కోతలకు మదుపులు పెడుతున్నాను. అవి ఏమాత్రం చాలవు. రైతు భరోసా డబ్బులు వస్తే కొంత ఉపయోగకరంగా ఉంటాయి.- పండి వాసుదేవరావు, రైతు, రాజపురంఎదురుచూస్తున్నారు.