ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు
దోపిడీ పాలన అంతమొందించడానికి సమరశీల ప్రజా పోరాటాలు సాగించాలని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు వై.కొండయ్య అన్నారు. బుధవారం మర్రిపాడు అమరవీరుల స్మారక స్థూపం వద్ద 45వ స్మారక సభ జరిగింది. సమసమాజ నిర్మాణం కోసం భారత విప్లవ ఉద్యమ నిర్మాణంలో అసువులు బాసిన అమరవీరులు అందరికీ నివాళ్లర్పించారు. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి ఆశయాల వెలుగులో నడవాలన్నారు. కేంద్రంలో నియంత మోడీ పాలనకు జగన్ వంత పాడుతున్నారని మండిపడ్డారు. విప్లవ కవి సుబ్బారావు పాణిగ్రాహి సతీమణి సురేఖ పాణిగ్రాహి ముందుగా విప్లవ జెండాను ఎగుర వేసారు. జిల్లా కమిటీ సభ్యులు గొరకల బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, పిఒడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ, కుత్తుం వినోద్, ఉత్తరాంధ్ర మహిళా సంఘం గౌరవ అధ్యక్షులు పి. అరుణ, ప్రజాకళామండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. నీలకంఠం, రాపాక మాధవరావు, నేతింటి నీలంరాజు, కుత్తుం హేమ, పోతనపల్లి మల్లేశ్వరరావు, రచయితలు నిశతాసి, బద్రి కూర్మారావు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న సురేఖ