పలాసలో దొంగల బీభత్సం

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని దొంగలు బీభత్సం సృష్టించారు. నిత్యం రద్దీగా ఉండే కాశీబుగ్గ పాత బస్టాండ్‌ ప్రాంతంలోని మహత్మగాంధీ షాపింగ్‌ కాంప్లెక్స్‌, ఐడిఎస్‌ఎంటి

పగులుకొట్టిన తాళాన్ని చూపిస్తున్న కూరగాయల వ్యాపారి

  • 11 దుకాణాల్లో రూ.1.20 లక్షల నగదు అపహరణ

ప్రజాశక్తి- పలాస

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని దొంగలు బీభత్సం సృష్టించారు. నిత్యం రద్దీగా ఉండే కాశీబుగ్గ పాత బస్టాండ్‌ ప్రాంతంలోని మహత్మగాంధీ షాపింగ్‌ కాంప్లెక్స్‌, ఐడిఎస్‌ఎంటి దుఖాణాల సముదాయంలో ఉన్న 11 దుఖాల్లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత దొంగలు చోరీకి పాల్పడ్డారు. పలు దుఖాణాల్లో వ్యాపారులు ఉంచుకున్న నగదు రూ.1.20 లక్షలు వరకు దొంగించినట్లు వ్యాపారులు తెలిపారు. వ్యాపారులు దినచర్యలో భాగంగా శనివారం తమ దుకాణాలు తెరిచేందుకు వచ్చిన సమయంలో ఆయా దుకాణాల తాళాలు బద్దలుగొట్టి ఉండడంతో దొంగతనాలు జరిగినట్లు గుర్తించారు. కొన్ని దుకాణాల్లో వ్యాపారులు కౌంటర్లో ఉంచిన రూ.పది నుంచి రూ.20 వరకు వరకు చోరీకి గురైనట్లు వ్యాపారులు తెలుసుకొని కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రద్దీగా ఉండే ప్రాంతంలో 11 దుకాణాల్లో ఒకేసారి చోరీకి పాల్పడడం సంచలనం కలిగించింది. రాత్రి సమయాల్లో గస్తీ తిరుగుతున్న పోలీసులకు ఏ మాత్రం అనుమానం కాకుండా దొంగతనాలు జరగడం వింతగొల్పుతోంది. పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారో? లేదో. ఈ సంఘటనతో రుజువు చేస్తుందని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

➡️