నెల రోజుల్లో తాగునీరు అందించాలి

మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయిల ద్వారా చేపడుతున్న పనులను పూర్తిచేసి

సరుబుజ్జిలి : శంకుస్థాపన చేస్తున్న స్పీకర్‌ సీతారాం

శాసనసభ స్పీకర్‌ సీతారాం

ప్రజాశక్తి- సరుబుజ్జిలి

మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయిల ద్వారా చేపడుతున్న పనులను పూర్తిచేసి నెల రోజుల్లో తాగునీరు అందించడానికి చర్యలు చేపట్టాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆదేశించారు. బుధవారం మండలంలో మతలబుపేట, చిన్న మతలబుపేట, గోనెపాడు గ్రామాల్లో రూ. 1.75 లక్షలతో జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీటి కొళాయిలు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మతలబుపేట గ్రామంలో స్పీకర్‌ శిలాఫలకం ఆవిష్కరిస్తున్న సమయంలో ఎన్నికల ముందు శంకుస్థాపన చేస్తున్నారు, పనులు ఎప్పటికీ పూర్తవుతాయో, తాగునీరు ఎప్పుడు అందుతుందోనని మహిళలు స్పీకర్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ ఎన్నికలకు వెళ్లే ముందే మంచినీటి కొళాయిలను ప్రారంభోత్సవం చేసి ఇంటింటికి తాగునీరు అందిస్తానని తెలిపారు. తక్షణమే పనులను ప్రారంభించి పనులను వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక ఆహ్వానితులు కెవిజె సత్యనారాయణ, జెడ్‌పిటిసి సురవరపు నాగేశ్వరరావు, వైసిపి మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు కోవిలాపు చంద్రశేఖర్‌, సర్పంచ్‌ వీరఘట్టపు జయలక్ష్మి, కృష్ణ గోనెపాడు సర్పంచ్‌ బిర్లంగి అమ్మాయమ్మ, మాజీ సర్పంచ్‌ మామిడి తిరుపతిరావు పాల్గొన్నారు.బూర్జ: అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందించడం జరిగిందని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు అన్నంపేట గ్రామంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన ప్రతిహామీని అమలు చేస్తున్న ఘనత సిఎం జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందనటువంటి వారు సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంబి పొందిన లబ్దిని వివరించారు. కార్యక్రమం ప్రారంభమైన నాటినుంచి తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేలా కృషి చేశానన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు సమపాలల్లో అమలు చేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేస్తూ, జనవరి నుంచి రూ.3 వేలు పింఛన్‌ మొత్తాన్ని అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి కర్నేన నాగేశ్వరరావు, జెడ్‌పిటిసి బెజ్జిపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షుడు, టిట్కో డైరెక్టర్‌ కండాపు గోవిందరావు, వైస్‌ ఎంపిపి కరణం కృష్ణంనాయుడు, మండల సచివాలయాల కో-ఆర్డినేటర్‌ గుమ్మడి రాంబాబు, మండల సర్పంచ్‌ల సంఘ అధ్యక్షుడు ఉదరు కుమార్‌, నాయకులు కొరికాన శంకరరావు, మామిడి ఆదినారాయణ పాల్గొన్నారు.

 

➡️