సమావేశంలో మాట్లాడుతున్న స్పీకర్ సీతారాం
* శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి – ఆమదాలవలస
నిర్ణీత గడువులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు సన్నద్ధం కావాలని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధికారులను ఆదేశించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆమదాలవలస నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, మున్సిపాల్టీకి సంబంధించిన హౌసింగ్ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఇళ్లు కట్టుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లిస్తోందని చెప్పారు. సిమెంట్, ఐరన్ తదితర నిర్మాణ సామగ్రిని అందజేస్తోందన్నారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న గృహాలన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ గణపతిరావు, డిఇఒ అప్పారావు, ఎఇలు తదితరులు పాల్గొన్నారు.