దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలి

మండలంలో చీడివలసకు చెందిన దళిత మహిళ కాయ పార్వతిపై మరణాయుధాలతో దాడికి పాల్పడిన పెత్తందారులను వెంటనే అరెస్టు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి జోగి గన్నయ్య, సిఐటియి జిల్లా సీనియర్‌ నాయకులు ఆర్‌.సురేష్‌బాబు డిమాండ్‌ చేశారు. మండలంలోని చీడివలసలోను, తహశీల్దార్‌ కార్యాలయం

ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు

ప్రజాశక్తి- పోలాకి

మండలంలో చీడివలసకు చెందిన దళిత మహిళ కాయ పార్వతిపై మరణాయుధాలతో దాడికి పాల్పడిన పెత్తందారులను వెంటనే అరెస్టు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి జోగి గన్నయ్య, సిఐటియి జిల్లా సీనియర్‌ నాయకులు ఆర్‌.సురేష్‌బాబు డిమాండ్‌ చేశారు. మండలంలోని చీడివలసలోను, తహశీల్దార్‌ కార్యాలయం నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతిపై దాడి చేసి వారం రోజులు గడుస్తున్నా… దాడి చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆవేదన కలిగించిందన్నారు. దాడి చేసిన వారిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. అలాగే చీడివలసలో పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేసి దళితలకు భద్రత కల్ల్పించాలన్నారు. పార్వతికి 13 కుట్లు పడినా ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో చలపతిరావు, వి.రాజారావు, జోగి నర్సింహులు, కోతి శ్రీనివాసరావు, కాల వెంకటరమణ, కాల సింహాచలం, కాల జగ్గారావు పాల్గొన్నారు.

 

➡️