త్వరితగతిన ఆర్‌ఆర్‌ కాలనీ సిద్ధం

Nov 22,2023 21:57
త్వరితగతిన మూలపేట ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీని సిద్ధం చేయించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ అధికారులను ఆదేశించారు. సంతబొమ్మాళి మండలం నౌపడలో నిర్మితమవుతున్న మూలపేట
  • జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌

ప్రజాశక్తి – నౌపడ

త్వరితగతిన మూలపేట ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీని సిద్ధం చేయించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ అధికారులను ఆదేశించారు. సంతబొమ్మాళి మండలం నౌపడలో నిర్మితమవుతున్న మూలపేట పోర్టు నిర్వాసిత కాలనీ పనులను సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌తో కలిసి బుధవారం పరిశీలించారు. రూ.35 కోట్లతో 55 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఆర్‌ఆర్‌ కాలనీకి ఎర్త్‌ లెవలింగ్‌, గ్రావెల్‌ రోడ్డు పనులు ఎంతవరకు వచ్చాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, తాగునీటి సరఫరా పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులను ఆదేశించారు. కాలనీలో మౌలిక వసతులు, భవనాలు, పాఠశాలలు ఏర్పాటు వంటి విషయాలు మ్యాప్‌ ద్వారా అధికారులను అడిగి ఆరా తీశారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ చలమయ్య, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.గురుకుల పాఠశాలకు స్థల పరిశీలనవజ్రపుకొత్తూరు : అక్కుపల్లి మత్స్యకార గురుకుల పాఠశాలకు శాశ్వత భవనాల నిర్మాణం కోసం బెండికొండ వద్ద స్థలాన్ని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ బుధవారం పరిశీలించారు. పాఠశాల కోసం సుమారు 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఎంపిక చేశారు. గురుకుల పాఠశాల ఐదు నుంచి పదో తరగతి వరకు రెండు సెక్షన్లతో ప్రస్తుతం అక్కుపల్లిలోని తుపాను రక్షిత భవనంలో నడుస్తోంది. పాఠశాలకు శాశ్వత భవనం లేకపోవడంతో వసతి సమస్యతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే స్థలం ఎంపిక చేయడంతో మరోసారి జెసి పరిశీలించారు. ఆయన వెంట తహశీల్దార్‌ బి.అప్పలస్వామి, డిటి వి.గిరిరాజ్‌, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎం.పాపారావు ఉన్నారు.

నౌపడ : ఆర్‌ఆర్‌ కాలనీని మ్యాపును పరిశీలిస్తున్న జెసి నవీన్‌

➡️