అవగాహన కల్పిస్తున్న అధికారులు
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
చేపల పిల్లలను ఎంపిక చేసుకోవడంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని, మూడు రకాల చేప పిల్లలను 2 మీటర్లలోతుండే చెరువులో ఎకరా నీటి విస్తీర్ణానానికి 2 వేల వరకు వదలాలని మత్స్యశాఖ ఉప సంచాలకులు పి.శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులకు జువాలజీ విభాగం ఆధ్వర్యాన నగరంలోని జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో చేపల పెంపకంపై మంగళవారం అవగాహన కల్పించారు. చేపలు, చెరువులు, భౌతిక, రసాయన పరీక్షల ప్రయోగాలను, చెరువులో దాణా నిర్వహణ, చేప పిల్లల నిల్వ, చెరువుల నిర్వహణ, చేపల పెంపకం, ఆధునిక పద్ధతులు, వ్యాధుల గుర్తింపు, నియంత్రణ, ప్రొసెసింగ్, చేపలు పట్టుకునే విధానం తదితర అంశాలపై వివరించారు. చేపలతో పాటుగా రొయ్యలు పెంచుకుంటే అధిక లాభాలను పొందవచ్చన్నారు. సేంద్రియ, రసాయన ఎరువుల్ని 15 రోజుల తేడాతో ఒకటి వేసుకున్నాక మరొకటి వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సహాయ సంచాలకులు సంతోష్‌కుమార్, ఎఫ్‌డీఓ కె గంగాధరరావు, ల్యాబ్ అసిస్టెంట్ పి వెంకట్ బాబు, దువ్వాడ ఈశ్వరరావు, కె గాయిత్రీ, అధ్యాపకులు ఐ హేమపద్మజ, డాక్టర్ వై రవికుమార్, విద్యార్థినులు పాల్గొన్నారు.