చిరుధాన్యాలపై అవగాహన

టెక్కలి ఆదిత్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్మెంట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులకు చిరుధాన్యాలపై అవగాహన తరగతులు నిర్వహించామని

అవగాహన కల్పిస్తున్న అధ్యాపకులు

ప్రజాశక్తి- టెక్కలి రూరల్‌

టెక్కలి ఆదిత్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్మెంట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులకు చిరుధాన్యాలపై అవగాహన తరగతులు నిర్వహించామని డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఐక్యరాజ్య సమితి 2023 ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. అందులో భాగంగా ఎఐసిటి సూచనల మేరకు చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, ఆరోగ్యం, వాణిజ్య అవకాశాలు బిటెక్‌, ఎంబిఎ విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వంటివాటిపై చైతన్య పర్చామన్నారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ఎ.ఎస్‌.శ్రీనివాసరావు, విభాగాల అధిపతులు, జి-20 కార్యక్రమాల సమన్వయకర్త అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.భాస్కరబాబు సదస్సులను పర్యవేక్షించారని తెలిపారు.

 

➡️