ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
నగరంలో 9వ డివిజన్ పరిధిలో బొంపాడ వీధిలో బాబు ష్యూరిటీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నగర టిడిపి అధ్వర్యాన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి హాజరై మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వ హయాంలో పేదప్రజలకు అన్ని విధాలా ఆదుకున్నామని, గడచిన నాలుగున్నరేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం ధరలు పెంచి సామాన్యులకు బతుకు తెరువు లేకుండా చేశారని విమర్శించారు. పథకాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకునే వైసిపి నాయకులు నెలకు ఎంత ఇస్తున్నారు, దొడ్డిదారిన ఎంత లాగేస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ పరిశీలకులు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ, నగర టిడిపి అధ్యక్షులు మాదారపు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి చిట్టి నాగభూషణం, ఉపాధ్యక్షులు పిఎంజె బాబు, డివిజన్ ఇన్‌ఛార్జి గండేపల్లి కోటేశ్వరరావు భవాని, మధు, జి.జ్యోతి, గోవింద, చిన్న పాల్గొన్నారు.కోటబొమ్మాళి: టిడిపి అధినేత చంద్రబాబును ఎన్నికలు పూర్తయ్యేవరకు జైలుకే పరిమితం చేయాలన్న వైసిపి కుట్రలు సాగలేదని టెక్కలి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు, మాజీ సర్పంచ్ పూజారి శైలజ వ్యాఖ్యానించారు. మండలం హరిశ్చంద్రపురం పంచాయతీ పరిధిలోని చిన్నహరిశ్చంద్రపురం, వింజాంపాడు తదితర గ్రామాల్లో బాబు షూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి టిడిపి మేనిఫెస్టోకు సంబంధించిన పోస్టర్లను పంపిణీ చేశారు. వైసిపి పాలనలో నిత్యావసర ధరలు, ఇసుక, సిమెంట్, బస్సు, విద్యుత్ ఛార్జీలను పెంచుతూ దోపిడీ పాలనను సాగిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు బొడ్డేపల్లి మోహన్, హనుమంతు సూర్యనారాయణ, హనుమంతు శేషగిరి, హనుమంతు అప్పన్న, గురువెళ్లి ప్రసాద్ పాల్గొన్నారు. అలాగే మండలం తిలారు పంచాయతీలో మాజీ ఎంపిపి తర్ర రామకృష్ణ ఆధ్వర్యాన బాబు షూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు.
పోస్టర్లను అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి