గడప గడపకూ సంక్షేమం

Nov 25,2023 23:47
అర్హత కలిగిన గడపగడపకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు వెల్లువలా కొనసాగుతున్నాయని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని శ్రీనివాసా చార్యులపేటలో

లబ్ధిదారులతో మాట్లాడుతున్న స్పీకర్‌ సీతారాం

ప్రజాశక్తి- ఆమదాలవలస

అర్హత కలిగిన గడపగడపకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు వెల్లువలా కొనసాగుతున్నాయని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని శ్రీనివాసా చార్యులపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల వల్ల ఈ నాలుగున్నరేళ్లలో అందిన లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హత కలిగిన లబ్ధిదారునికీ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేసి ఆర్థికభరోసా కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే దక్కిందని కొనియాడారు. పేదల ఆత్మగౌరవాన్ని పెంచేలా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని అన్నారు. సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు పాలనను చేరువ చేశారని అన్నారు. గత ప్రభుత్వం మాదిరి జన్మభూమి కమిటీలు నేడు లేవని దళారులు, అవినీతి లేని పాలనను ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. విద్య, వైద్యం, సేద్యం రంగాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పిఎసిఎస్‌ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, ఎంపిటిసి మాజీ సభ్యులు గురుగుబెల్లి ప్రభాకరరావు, సర్పంచ్‌ ప్రతినిధి గురుగుబెల్లి నీలారావు, ఎంపిడిఒ ఎస్‌.వాసుదేవరావు, విద్యుత్‌శాఖ ఎఇ రవికుమార్‌, ఎపిఎం పైడి కూర్మారావు పాల్గొన్నారు.

 

➡️