అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ అరుణ్‌బాబు
పుట్టపర్తి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన స్పందన కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీదారులపై నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు వాటికి పరిష్కారం చూపాలని కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్, డిఆర్‌ఒ కొండయ్య, సిపిఒ విజరు కుమార్, గ్రామ వార్డు సచివాలయాల కోఆర్డినేటర్ శివారెడ్డి తదితరులతో కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన అర్జీలను క్షేత్రస్థాయిలో క్షుణ్నంగా పరిశీలించి వాటిని పారదర్శకంగా విచారణ చేసి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీదారుడు సంతప్తి చెందే విధంగా పరిష్కరించాలన్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేయండిగ్రీవెన్స్ అనంతరం కలెక్టర్ అన్ని మండలాల అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, గహ నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. ఆడుదాం ఆంధ్ర, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలన్నారు. పంచాయతీరాజ్ కింద చేపట్టిన గ్రామ సచివాలయాలు, 22 రైతు భరోసా కేంద్రాలు, 10 వైఎస్సార్ హెల్త్ క్లీనిక్ భవనాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పిఆర్ డిఈ మాట్లాడుతూ వారంలోపు భవన నిర్మాణ పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని సమాధానం ఇచ్చారు. అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువ పనులు పెండింగ్‌లో ఉన్నాయని వచ్చే గురువారం నాటికి పనుల్లో పురోగతి కనిపించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా 100 శాతం అభివద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. మంగళవారం నాడు ఎన్నికలకు సంబంధించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారని ఎన్నికలకు సంబంధించిన నియోజకవర్గ సహాయ ఎన్నికల అధికారులు డిప్యూటీ తహశీల్దార్లు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశంలో పాల్గొనాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పిఆర్ ఎస్‌ఈ గోపాల్ రెడ్డి, డిఎంహెచ్‌ఒ డాక్టర్ ఎస్‌వి.కృష్ణారెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి చాంద్‌బాషా, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రషీద్ ఖాన్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.