ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు
పుట్టపర్తి అర్బన్ : హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని వివిధ తండాల్లో తాగునీటి సౌకర్యం, రోడ్డు వసతి, శ్మశాన వాటికల లభివద్ధి కోసం ఎంపీ నిధులను మంజూరు చేస్తామని, అందుకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఎంపీ గోరంట్ల మాధవ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోనే మినీ కాన్ఫరెన్స్ హాల్లో శ్రీ సత్యసాయి జిల్లాఅభివద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు దిశా కమిటీ సెక్రటరీ జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కషి చేయాలన్నారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మౌలిక వసతులు పనులు గుర్తించి వాటికి ఎంత నిధులు అవసరమో నివేదికల అందజేయాలని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీ లాండ్స్ కింద జిల్లాలో 232 పనులు గుర్తించామన్నారు. ఇందులో రూ.13.90కోట్లకు ఆమోదం లభించిందన్నారు. ఇందులో 140 పనులు పూర్తికాగా, రూ.10.40 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సిపిఆర్ గోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, డీఈలు, ఏఈలు, పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లు పాల్గొన్నారు.