సమావేశంలో మాట్లాడుతున్న బికె. పార్థసారధి
గోరంట్ల : పెనుకొండ అసెంబ్లీ స్థానానికి టిడిపి అభ్యర్థి విషయంలో వస్తున్న వదంతులు నమ్మొద్దని టికెట్ తనకే వస్తుందని మాజీ ఎమ్మెల్యే బికె. పార్థసారధి అన్నారు. మండలములోని కోరేవాండ్లపల్లి బూదిలివాళ్ళపల్లిలో బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ 2024లో జరిగే శాసనసభ ఎన్నికల్లో పెనుగొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందని ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు. నియోజకవర్గంలో కొంతమంది తనకు ఎమ్మెల్యే టికెట్టు రాదని వదంతులు సృష్టిస్తున్నారన్నారు. రాష్ట్ర కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆధ్వర్యంలో ఎంపీ ఎమ్మెల్యేల టికెట్ల కేటాయింపు పై చర్చలు జరుగుతున్నాయే తప్ప టికెట్ల కేటాయింపు ఎక్కడా జరగలేదన్నారు. ఈసారి టిక్కెట్టు వచ్చేది తనకేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం దుర్మార్గపు పాలన సాగిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల ప్రధాన కార్యదర్శి అశ్వత్ రెడ్డి, హిందూపురం పార్లమెంటు కార్యదర్శి నరసింహులు, మరిరెడ్డి పల్లి నరసింహులు, దాసయ్య, బెల్లాల చెరువు చంద్ర, నీలకంఠారెడ్డి, నరేంద్ర, మాజీ సర్పంచులు బాలకృష్ణ, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు