సైబర్ నేరగాళ్ల అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అన్బురాజన్
అనంతపురం ప్రతినిధి : తాము పంపిన యూటూబ్‌ను సబ్‌స్క్రైబ్ చేసి రేటింగు ఇచ్చినందుకు కమీషన్ల రూపంలో లక్షల ఆదాయం వస్తుందని చెప్పి మోసగించే సైబర్ నేరగాళ్లను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేసి కటకటలా వెనక్కు పంపారు. దీనిఅసలు కింగ్‌పిన్ దుబారులో ఉన్నట్టు గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలను అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్సు హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ముందుగా డబ్బులు చెల్లిస్తే తాము యూబూట్ వీడియోలను పంపుతామనివాటిని సబ్‌స్క్రైబ్ చేసి రేటింగు ఇస్తే అందుకు కమీషన్ వస్తుందని సైబర్ నేరగాళ్లు నమ్మబలుకుతారు. ఆ రకంగా మొదట్లో కొంత డబ్బును కమీషన్ రూపంలో ఇస్తారు. ఆ తరువాత డబ్బులు వేయించుకుని యూటూబ్ వీడియోలు పంపకుండా ఆపేసి డబ్బులను ఫేక్ అకౌంట్ల ద్వారా దుబారుకు తరలించి, అక్కడ డ్రా చేస్తారు.బయటపడింది ఇలా…అనంతపురం జిల్లా గార్లదిన్నెలో అనిల్‌కుమార్ అనే ప్రయివేటు చిరుద్యోగికి సైబర్ నేరాగాళ్లు మోసం చేశారు. టెలిగ్రాం మెసెంజర్‌లో ఈ ఏడాది సెప్టెంబరు 21వ తేదీన అనిల్‌కమార్‌కు శ్వేత శర్మ పేరున లింకు వచ్చింది. డిజిటల్ వర్కులో పార్టుటైమ్ జాబ్ చేస్తే అదనపు ఆదాయం వస్తుందని ఆ మెసెంజరు సారాంశాన్ని దీన్ని చూసి ఆసక్తి చూపిన అనిల్‌కుమార్ వారి సూచనల మేరకు నిర్వాణ డిజిటల్ గ్రూపులో యాడ్ అయ్యాడు. ఈయనకు ప్రత్యేకంగా యూజర్ ఐడిని ఇచ్చారు. రూ.10 వేలు డబ్బులు కడితే వీడియోలు పంపుతామని దానికి సబ్‌స్క్రైబ్ చేసి రేటింగు ఇస్తే కమీషన్ వస్తుందని నమ్మించారు. తన వద్ద డబ్బుల్లేవంటే మొదట తామే చెల్లిస్తామని చెప్పి వీడియాలు పంపారు. దాన్ని అనిల్‌కుమార్ సబ్‌స్క్రైబ్ చేసి రేటింగు ఇచ్చాడు. దానికి రూ.800 కమీషన్ రూపంలో ఇచ్చారు. దీన్ని చూసి పది వేల రూపాయలు చెల్లిస్తే మరో వీడియో పంపుతామని చెప్పడంతో ఈసారి తానే స్వయంగా పది వేల రూపాయలు చెల్లించాడు. ఈసారి రూ.2625 కమీషన్ వచ్చింది. కమీషన్ పెరుగుతుండటంతో ఈసారి రూ.50,500 పంపమని సైబర్ నేరగాళ్లు అడిగారు. కమీషన్ వస్తోందన్న ఆశతో అడిగినంత డబ్బు చెల్లించాడు. ఎక్స్‌క్లూజీవ్ డేటా అని చూపించి ఈసారి కమీషన్ ఇవ్వకుండా హోల్డ్‌లో పెట్టారు. రూ.1.50 లక్ష కడితే మరిన్ని వీడియోలు పంపుతామని చెప్పడంతో ఆ డబ్బును చెల్లించాడు. ఆ తరువాత కూడా కమీషన్ రాలేదు. ఎందుకు రాలేదని ప్రశ్నిస్తే ఈసారి రూ.4.99 లక్షలు కడితే కమీషన్ వస్తుందని చెప్పాడు. అంత డబ్బు కట్టలేనని చెప్పడంతో ఐడిని బ్లాక్ చేశారు. దీంతో తాను మోసపోయానని భావించిన అనిల్‌కుమార్ సైబర్ పోర్టల్ 1930కి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా గార్లదిన్నె పోలీసులు దర్యాప్తును చేపట్టారు.విచారణలో విస్తుగొలిపే విషయాలుదీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ చేపడితే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి ఉత్తర భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి అసలు సూత్రధారిగా ఉన్నాడు. ఈయన దుబారులో ఉంటాడు. ఇక్కడ కొద్ది మందిని నియమించుకుని వారి ద్వారా అమాయకులకు వలవేయడం డబ్బులు తమ ఖాతాల్లో వేయించుకుని క్రిప్టో కరెన్సీ రూపంలో దుబారుకు తరలించి అక్కడ డ్రా చేసుకుంటున్నారు. ఇందుకు ఇక్కడ పనిచేసే వారికి ఒక్క శాతం కమీషన్ ఇస్తున్నారు. ఎన్‌సిఆర్‌బి పోర్టల్‌లో మొత్తం 1550 ఫిర్యాదులు ఈ రకమైనవి అందాయి. సుమారు 172 ఫేక్ అకౌంట్ల నుంచి రూ.350 కోట్లకుపైగా దుబారుకు తరలించినట్టు అంచనా. ఈ విచారణలో అనంతపురం జిల్లా పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. వారికి కమీషన్‌లో రూపంలోనే రూ.20 లక్షలు అందినట్టు గుర్తించారు. ఇప్పటి వరకు జరిపిన విచారణ వరకు 16 ఫేక్ అకౌంట్లను గుర్తించి ప్రీజ్ చేయించారు.అరెస్టు అయిన వారి వివరాలుతిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన మహమ్మద్ సమ్మద్, అదే జిల్లా వెంకటగిరికి చెందిన వెంకటాచలం, అనంతపురం నగరానికి చెందిన సంధ్యారాణి, ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన అజరురెడ్డి, తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన ఎం.సందీప్ అరెస్టు అయిన వారిలోనున్నారు.