బుక్కపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌ నాయక్‌ ఆత్మహత్య

సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌ నాయక్‌ (ఫైల్‌ ఫొటో)

            అనంతపురం ప్రతినిధి: అవినీతి నిరోధక శాఖకు చిక్కి పరారీలోనున్న శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌ నాయక్‌ (47) ఆత్మహత్యకు పాల్పడారు. శనివారం సాయంత్రం చెన్నైలోని ఒక భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. ఈ నెల 22వ తేదీన ఓ రైతు నుంచి పది వేల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చేతికి చిక్కారు. కార్యాలయంలో ఎసిబి అధికారుల విచారణ జరుగుతున్న సమయంలో ఆయన బాత్‌రూంకు వెళ్లివస్తాయని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. మూడు రోజులుగా పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. అయినా ఆయన ఆచూకీ లభించలేదు. ఈ పరిస్థితుల్లో శనివారం నాడు శ్రీనివాస్‌నాయక్‌ చెన్నై నగరంలో ఆత్మహత్యకు పాల్పడినట్టు బంధువులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడికి బయలుదేరి వెళ్లారు. శ్రీనివాస నాయక్‌ది పెనుకొండ మండలం గౌనిపల్లి గ్రామం. ఈయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

➡️