సమావేశంలో మాట్లాడుతున్న కందికుంట వెంకటప్రసాద్
కదిరి టౌన్ : వైసిపి ప్రభుత్వం బిసిలను ఓటు బ్యాంకుగా వాడుకుంటుందే తప్ప వారికి గుర్తింపు ఇవ్వలేదని నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు. పట్టణంలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీనియర్ ఐపిఎస్ అధికారి అయిన ద్వారకా తిరుమలరావును కాదని తన సామాజిక వర్గానికి చెందిన జూనియర్ అధికారిని రాష్ట్ర డిజిపిగా ఎంపిక చేశారని విమర్శించారు. గత ప్రభుత్వం బిసి సబ్ ప్లాన్ నిధులు మంజూరు చేస్తే వాటిని సైతం పక్కదారి పట్టించారని, బిసి కులాలకు చెందిన 14 లక్షల ఎకరాలను కాజేశారని ఆరోపించారు. బిసిలపై దాడులు అధికమయ్యాయన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపికి బిసిలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.