జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శనీయం

Nov 28,2023 22:23

 పూలే చిత్రపటం వద్ద అధికారుల నివాళి

            పుట్టపర్తి అర్బన్‌ అట్టడుగు వర్గాల ప్రజలకు జ్యోతిరావు పూలే ఎన్నో సేవలు అందించారని ఆయన జీవితం ఆదర్శనీయమని జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ కొండయ్య మాట్లాడుతూ అట్టడుగు ప్రజల అభివృద్ధికి, మహిళల స్థితిగతులను మెరుగుపరచడానికి, విద్యావ్యాప్తికి జ్యోతిరావు పూలే చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. చదువు లేకపోవడం వల్ల జరిగే అనర్థాలపై ప్రజలలో చైతన్యం తీసుకొచ్చారన్నారు. బాలికల విద్యతోపాటు కుల వ్యవస్థను వ్యతిరేకించి సమసమాజ స్థాపనకు ఆనాడే కృషిచేసిన గొప్ప మహినీయుడని అని తెలిపారు. దోపిడీ వ్యవస్థ నుంచి అట్టడుగు ప్రజలను అంటరాని వారిని విముక్తి చేయడానికి నిరంతరం కృషిచేసిన జ్యోతిరావు పూలే జీవితం అందరికీ ఆదర్శమని తెలిపారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం అధికారి నిర్మల జ్యోతి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సామాజిక అసమానతలపై అలుపెరగని పోరాటం చేశారని, అణగారిన వర్గాల విద్య అభివృద్ధి కోసం కృషి చేశారని అన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు సమాజ అభివృద్ధికి పాటుపడాలనికోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్‌ కులాల సంక్షేమం సాధికారిక అధికారి శివరంగ ప్రసాద్‌, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రాము నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️