జగన్‌ హయాంలో ప్రజల వద్దకు పాలన : ఎమ్మెల్యే

జగన్‌ హయాంలో ప్రజల వద్దకు పాలన : ఎమ్మెల్యే

తనకల్లు మండలంలో తారురోడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి

 

                    కదిరి అర్బన్‌ : ఎపిలో అధికారం చేపట్టిన వెంటనే ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో గ్రామ, వార్డు, సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రభుత్వ పాలనను ప్రజల వద్దకు తెచ్చిన ఘనత సిఎం జగన్‌దే అని ఎమ్మెల్యే డాక్టర్‌ పివి. సిద్ధారెడ్డి కొనియాడారు. పట్టణంలోని రెవెన్యూకాలనీ వార్డు సచివాలయం పరిధిలో శుక్రవారం ‘ వై ఎపి నీడ్జ్‌ జగన్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలనే కాకుండా చెప్పనటువంటి హామీలనూ అమలుచేశామని, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, వైసిపి ప్రజాప్రతినిధులు, మండల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.తారురోడ్డు ప్రారంభం తనకల్లు : మండల పరిధిలోని చీకటిమానిపల్లి, సిజి ప్రాజెక్టు రోడ్డు నుంచి యర్రబల్లి, కర్నాటక రాష్ట్ర సరిహద్దు వరకూ రూ. 122 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన తారురోడ్డును ఎమ్మెల్యే పివి.సిద్ధారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎం జగన్‌ సహకారంతో నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి గ్రామానికి అప్రోచ్‌ రోడ్లు వేశామన్నారు. నిరంతరం ప్రజల కోసం శ్రమించే వైసిపి ప్రభుత్వాన్ని మరోమారు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ మధుసూదన్‌రెడ్డి, కొక్కంటి శ్రీనివాసులునాయుడు, మల్‌రెడ్డిపల్లి సర్పంచి శైలజఅమూల్యనాథ్‌రెడ్డి, గణేష్‌రెడ్డి, శంకర, వైసిపి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️