వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్
పుట్టపర్తి అర్బన్ : ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా అభివద్ధి పనులు పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు తెలిపారు. శనివారం విజయవాడ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్ పాల్గొన్నారు. ఈ సమీక్షలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర ఆదివారం నుంచి ప్రారంభమవుతాయని జిల్లాలో తగిన చర్యలు తీసుకోవాలని జవహర్ రెడ్డి ఆదేశించారు. రెవెన్యూ, రీ సర్వే, జాతీయ రహదారులకు భూ సేకరణ, భూ కేటాయింపులు, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, డైయిరీ అభివద్ధి, గహ నిర్మాణాలు, ప్రాధాన్యత భవన నిర్మాణాలు తదితర అంశాలపై సిఎస్ సమక్షించారు. అభివద్ధి పనులు ప్రాధాన్యత భవనాల నిర్మాణాలు వేగవంతంగా పనులు జరుగుతున్నాయని గడువులోగా పూర్తి చేస్తామని కలెక్టర్ వివరించారు.