విలేకరుల సమావేశంలో పాల్గొన్న వైసిపి నాయకులు
హిందూపురం : వైసిపి నేతలపై ప్రజా ప్రతినిధులపై నిరాధారణ ఆరోపణలు చేయడం కాదు… ఆధారాలు ఉంటే చూపించాలని వైసిపి నాయకులు అన్నారు. టిడిపి నాయకులు చేసిన ఆరోపణలను వైసీపీ నాయకులు ఖండించారు. ఆదివారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసిపి నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ, వైస్ చైర్మన్లు జబీవుల్లా, బలరామిరెడ్డి, బి బ్లాక్ నరేష్, పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. బాలయ్య నియోజకవర్గ పర్యటన ఓ సినిమా షూటింగ్ తరహాలో ఉంటుందని ఎద్దేవా చేశారు. గత టిడిపి ప్రభుత్వంలో బాలయ్య చేసిన అభివృద్ధిపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. టిడిపికి ఇక్కడ కాలం చెల్లిందని, వచ్చే ఎన్నికల్లో బాలయ్యకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు మణి, నాగేంద్ర కుమార్, మల్లికార్జున, రోషన్, గిరి, నాయకులు బాబు, ఫారూఖ్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.