అభివృద్ధే ధ్యేయం : ఎమ్మెల్యే

Nov 28,2023 22:17

సబ్‌స్టేషన్‌ను ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, కలెక్టర్‌ అరుణ్‌బాబు, తదితరులు

             కదిరి అర్బన్‌ :అభివృద్ధే సిఎం జగన్‌, వైసిపి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్‌ పివి.సిద్ధారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని గట్లు సమీపంలో ముత్యాలచెరువులో నూతనంగా నిర్మించి న సబ్‌స్టేషన్‌ను మంగళవారం సిఎం జగన్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా ఎమ్మెల్యే, అతిథిగా కలెక్టర్‌ అరుణ్‌బాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో 4 సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టామని, ఇప్పటికే మల్లమీద పల్లిలో ప్రారంభించగా, నేడు ముత్యాలచెరువులో ప్రారంభిస్తున్నామన్నారు. త్వరలోనే మిగిలిన సబ్‌స్టేషన్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందజేస్తా మన్నారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ వంశీకృష్ణ, ట్రాన్స్‌కో డిఇ మోజేస్‌, ఎడి శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది, వైసిపి నాయకులు పాల్గొన్నారు.

➡️