కలెక్టర్ నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 70 అర్జీలు

Nov 22,2023 16:40 #Anantapuram District

ప్రజాశక్తి-బొమ్మనహల్ : మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గౌతమి ఆధ్వర్యంలో జగనన్న తెలుపుదాం అనే స్పందన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు గ్రామాల నుంచి 70 అర్జీలు వచ్చాయని ఎంపీడీవో షకీలా బేగం తెలిపారు. ఈ సందర్భంగా మండలంలో భూములు సమస్య విషయమై 47 అర్జీలు పంచాయతీరాజ్ శాఖ ఖర్చులు 12 వ్యవసాయ శాఖ అర్జీలు 5 ఆరోగ్యశాఖ అర్జీలు ఒకటి ఐసీడీఎస్ అర్జీలు రెండు సోషల్ సంబంధించి రెండు అర్జీలు రికార్డులు నమోదు అయినట్లు వారు తెలిపారు. ఈ అర్జీలను ఆయా డిపార్ట్మెంట్ వారిగా పంపడం జరిగిందని ఆమె అన్నారు. జిల్లా కలెక్టర్ గౌతమి బొమ్మనాల మండలానికి రావడం ముందుగా మేంకల్ ఆంజనేయస్వామి దర్శించుకోవడం వారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం బొమ్మ నాలుగు రావడం వలన ప్రధాన కార్యాలయం ప్రవేశములో పదిమంది దళితులు నేలపై కూర్చొని రెవిన్యూ అధికారులు అవినీతికి పాల్పడ్డారని అలాంటి అధికారులను సస్పెండ్ చేయాలని తాసిల్దారు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం జరిగింది. ఒకే సర్వే నంబర్లు రెండు కుటుంబాలకు పట్టాదారు పాస్బుక్కులు మంజూరు చేయడం వల్ల వారు కలెక్టర్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వాళ్లతో పాటు జిల్లా డిఎంయు వ్యవసాయ శాఖ జెడి సోషల్ వెల్ఫేర్ ఎన్ ఆర్ జి ఎస్ పిడి రాయదుర్గం సీఐ విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులు పాల్గొని స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచు యోగేశ్వర్ రెడ్డి నేమ్ కల్ సర్పంచ్ పరమేశ్వర ఉంతకల్లు సర్పంచ్ ముక్కన్నా ఉద్దేహళ్, మాజీ సర్పంచ్ కోటేశ్వర్ రెడ్డి, సింగారం సర్పంచ్ కృష్ణ, సిద్దరాంపురం మాజీ సర్పంచ్ రామన్న, బొల్లనగుడ్డం సర్పంచ్ గాది లింగ పాల్గొన్నారు.

➡️